ఇస్రో, డీఆర్‌డీఓలపై ఆంక్షల్ని ఎత్తివేసిన అమెరికా
వాషింగ్టన్ ,,జనవరి 25: భారత అంతరిక్ష సంస్థ -ఇస్రో, రక్షణ సంస్థ- డీఆర్‌డీఓలను ఎగుమతుల నియంత్రణ జాబితా నుంచి అమెరికా ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్‌లో భారత్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎగుమతుల నియంత్రణ జాబితా నుంచి తొలగిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత చేరువయ్యే అవకాశాలున్నాయి. భారత ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తివేయడంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేన్ (ఇస్రో) సంస్థల, అనుబంధ సంస్థల ఉత్పత్తులకు తప్పనిసరిగా లెసైన్స్లు తీసుకోనవసరం లేకుండా వెసులుబాటు కలిగింది. 1998 సంవత్సరంలో అణ్వాయుధాల పరీక్షలు నిర్వహించిన తర్వాత నుంచి భారతదేశంపై అమెరికా ఆంక్షలు విధించింది.
Comments