శ్రీలంక నౌకాదళ దాడిలో మరో భారత మత్స్యకారుని మృతి
కొలంబో,జనవరి 23: శ్రీలంక నౌకాదళ సిబ్బంది జరిపిన దాడిలో మరో భారత మత్స్యకారుడు మరణించాడు. శనివారం పుష్పవనం తీర ప్రాంతంలో చేపలు పట్టుకుంటున్న ముగ్గురు భారత మత్స్యకారులపై లంక నేవీ దాడి చేసింది. వీరిలో ఒక వ్యక్తి మెడకు తాడుతో బిగించి సముద్రంలోకి తోసేయడంతో అతడు మరణించాడని సమాచారం. మరో ఇద్దరు మత్స్యకారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గత పక్షం రోజుల్లో లంక నేవీ ఇద్దరు భారత మత్స్యకారులను చంపింది. వీటిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఆదివారం ఈ విషయంపై అధికారులతో చర్చించారు. మత్స్యకారుల మృతిపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని తమిళనాడులోని నేవీ అధికారులను ఆదేశించారు.
Comments