జయసుధ 'తెలంగా'నం' !
హైదరాబాద్,జనవరి 24: సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు, సినీ నటి జయసుధ తెలంగాణ పాట అందుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే రచ్చబండ వంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం ఉండదని, కాంగ్రెసు ఉండదని ఆమె అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందేనని, తెలంగాణ పోరాటం ఆగలేదని ఆమె అన్నారు.
Comments