హైకోర్టును ఆశ్రయించిన యడ్యూరప్ప
బెంగళూరు,జనవరి 22 : తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప, హోం మంత్రి ఆర్.అశోక్ భూ కుంభకోణాలు, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, వారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కేఎన్. బాలరాజ్, సిరాజిన్ బాషాలు సమర్పించిన పిటిషన్‌ను గవర్నర్ భరద్వాజ్ మన్నించారు. దీంతో యడ్యూరప్పను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
Comments