మరో బలప్రదర్శనకు జగన్ రె 'ఢీ' !
హైదరాబాద్,జనవరి 18: కొత్త పార్టీ పెట్టబోతున్న మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో బలప్రదర్శనకు సిద్ధపడుతున్నారు. వరుస తుఫానుల ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కృష్ణానదీ తీరం సాక్షిగా లక్ష్యదీక్షను,ఢిల్లీలో జలదీక్షను విజయవంతంగా నిర్వహించిన జగన్ ముచ్చటగా మూడోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సవాల్ చేసేలా పెట్రోల్ ధరల పెంపుపై సమరశంఖం పూరించారు.పెట్రోల్ ధరల పెంపుపై ఈనెల 22వ తేదీన విశాఖలో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు జగన్ ప్రకటించారు. ప్రస్తుతం అ విశాఖ్ జిల్లాలో సాగిస్తున్న ఓదార్పు యాత్రలో భాగంగా మంగళవారం పాయకరావుపేటలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను సాగిస్తున్న ఓదార్పు యాత్రను 21వ తేదీ వరకు కొనసాగిస్తామని ప్రకటించారు.

Comments