ముఖ్యమంత్రి, గవర్నర్ల 'కర్ణాటకం' !
బెంగళూరు,జనవరి 21: కర్ణాటక లో ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య కుమ్ములాట తీవ్రస్థాయికి చేరింది. ఒక భూమి కుంభకోణం కేసులోముఖ్యమంత్రి విచారించేందుకు గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ అనుమతించారు. ఈ కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్ నిలిపివేస్తూ మంత్రి వర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ తీరుకు నిరసనగా బిజెపి శనివారం నాడు కర్ణాటక బంద్ కు పిలుపు ఇచ్చింది. గవర్నర్ ని రీకాల్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
Comments