బీబీసీ హిందీ రేడియో బంద్...
లండన్ , జనవరి 26: : వ్యయం తగ్గింపులో భాగంగా ప్రముఖ వార్తాప్రసారాల సంస్థ బీబీసీ మార్చి నుంచి తన హిందీ రేడియో సర్వీసును మూసివేయనుంది. వరల్డ్ సర్వీస్ విభాగంలోని ఈ రేడియోతోపాటు మాసిడోనియన్, అల్బేనియన్, సెర్బియన్, పోర్చుగీస్ రేడియోలకు కూడా స్వస్తి పలకనుంది. సంస్థ డెరైక్టర్ జనరల్ మార్క్ థాంప్సన్ బుధవారంమిక్కడ ఈ వివరాలు వెల్లడించారు. హిందీ షార్ట్‌వేవ్ రేడియో మూతపడినా ఆన్‌లైన్, ఇతర భాగస్వామ్య ఎఫ్‌ఎం రేడియోలలో ఆ భాషా ప్రసారాలను కొనసాగిస్తామన్నారు. ఈ ఐదు రేడియోలను మూసేయడం వల్ల 650 మంది ఉద్యోగాలు కోల్పోతారని, ఏడాదికి రూ.330 కోట్ల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. 3 కోట్ల మంది శ్రోతలు దూరమవుతారని చెప్పారు.
Comments