ఎమ్మెల్యే నీరజా రెడ్డిపై అరెస్ట్ వారెంట్
కర్నూలు,జనవరి 24 : కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే నీరజా రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బెంగళూరులో జరిగిన అగ్రహారం ప్రభాకర రెడ్డి హత్య కేసులో నీరజా రెడ్డి నిందితురాలు. ఈ కేసుకు సంబంధించి ఆమెకు ఆరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆమె కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు. ఆమె కనిపించడంలేదని ఆమె గన్'మెన్'లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె అయిదు రోజులుగా అదృశ్యమయ్యారని అంటున్నారు.
Comments