మాస్కో ఎయిర్‌పోర్టుపై ఆత్మాహుతి దాడి: 35మంది మృతి
మాస్కో,,జనవరి 24: : మాస్కోలోని దొమొదెదొవో అంతర్జాతీయ విమానాశ్రయంపై సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 7.02 గంటలకు జరిగిన ఈ సంఘటనలో 35 మంది మరణించగా, 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. లగేజీ తనిఖీచేసే ప్రాంతంలో పేలుడు సంభవించడంతో, విమానాశ్రయం దద్దరిల్లింది. అక్కడే ఉన్న విమానాశ్రయ ఉద్యోగులు తునాతునకలైపోయారు. విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి జరిగినట్లు బిజినెస్ ఎఫ్‌ఎం రేడియో ప్రకటించింది. డిపార్చర్ హాలు వద్ద ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు పేరు వెల్లడించని భద్రతా సిబ్బంది ఒకరు చెప్పినట్లు ‘ఇంటర్‌ఫాక్స్’ వార్తాసంస్థ వెల్లడించింది. ఇది ఉగ్రవాద చర్యేనని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని రష్యన్ దర్యాప్తు కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు.
Comments