144వ సెక్షన్ తో ఒ.యు. పిజి పరీక్షలు
హైదరాబాద్ ,జనవరి 19: ఉస్మానియా విశ్వవిద్యాలయం పిజి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.పరీక్షా కేంద్రాల వద్ద ఫిబ్రవరి 7వ తేదీ వరకు 144వ సెక్షన్ విధించారు. కాగా, తెలంగాణ ప్రకటించే వరకు తాము సెమిస్టర్ పరీక్షలు వ్రయ బోమని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Comments