నాగార్జున సోషియో ఫాంటసి 'డమరుకం'!

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ హీరో నాగార్జునతో సోషియో ఫాంటసి చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. వినోదాత్మక చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తారు భారీ వ్యయంతో సెట్స్ ను కూడా ఈ చిత్రం కోసం డిజైన్ చేస్తున్నారు. నాగార్జున కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా దీనిని నిర్మించడానికి నిర్మాత వెంకట్ సన్నాహాలు జరుపుతున్నారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. 'డమరుకం' అనే టైటిల్ని దీనికి రిజిస్టర్ చేసి ఉంచారు. నూతన సంవత్సరారంభంలో షూటింగ్ మొదలు కావచ్చు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు