లగడపాటి హంగామా!

న్యూఢిల్లీ,డిసెంబర్ 13 :  విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో మౌనపోరాటానికి దిగారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్కు అవకాశం ఇవ్వకపోవడంతో   ఆయన నిరసన తెలుపుతూ లోక్ సభలో మౌనదీక్ష ప్రారంభించారు.ఈ విషయం తెలుసుకున్న పార్లమెంటు వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్-లగడపాటిని కలిసి నచ్చజెప్పారు. వచ్చే పార్లమెంటు సెషన్‌లో రైతాంగ సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తామని బన్సాల్ హామీ ఇవ్వడంతో లగడపాటి దీక్ష విరమించారు. ఆ తర్వాత, లగడపాటి మీడియా తో మాట్లాడుతూ, పార్లమెంటుపై ఒక్కమారే దాడి జరిగిందని,  అయితే పార్లమెంటులో ప్రతీ రోజూ దాడి జరుగుతూనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి వీలులేకుండా సభ్యులు పరస్పర దాడికి దిగుతూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు