జగన్ ను కలిసిన ఎమ్మెల్యే నాని

విజయవాడ,డిసెంబర్ 13 : చల్లపల్లి మండలం పాతమాజేరు గ్రామంలో మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డిని మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని నాని కలిశారు. జగన్ కు సంఘీభావం తెలిపేందుకు అధిక సంఖ్యలో నాని అనుచరులు కూడా ఈ గ్రామానికి వచ్చారు. కారులో కూర్చొని నాని కొద్దిసేపు జగన్ తో మాట్లాడారు. ఆ తరువాత ఆయన కూడా రైతులను పరామర్శించేందుకు జగన్ తోపాటు బయలుదేరారు. జగన్మోహన రెడ్డి పర్యటనలో పాల్గొనడంలో తప్పులేదని నాని అన్నారు. రైతులను పరామర్శించడానికి మాత్రమే జగన్ వచ్చారని ఆయన అన్నారు. ఈ యాత్రలో పాల్గొన వద్దని అధిష్టానం నుంచి తనపై వత్తిడి ఏమీలేదని చెప్పారు. కార్యకర్తల కోరిక మేరకే తాను ఇక్కడికి వచ్చానని, ఇందులో రాజకీయ ఎత్తుగడలు ఏమీలేవని స్పష్టం చేశారు. ఇలావుండగా, కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి యాత్రలో పాల్గొంటే నష్టమేమీలేదని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ, ప్రభుత్వం వేరువేరు అని, దేని పని అది చేసుకుపోతుందని చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు