డెడ్‌లైన్‌కు కట్టుబడి ఉన్నాం: శ్రీకృష్ణ కమిటీ

న్యూఢిల్లీ,డిసెంబర్ 12: ‘తెలంగాణ’పై కేంద్రప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఈ నెల 16న హైదరాబాద్ రానున్నారు. ఐదుగురు సభ్యుల కమిటీ ఈ నెల 16న హైదరాబాద్ చేరుకుని, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమవుతుంది. 4 నెలల పాటు రాష్టమ్రంతా పర్యటించి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై ప్రజాభిప్రాయాలు సేకరించిన కమిటీ, ఈ నెల 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ‘31న కమిటీ నివేదిక అందిస్తుంది.. సందేహంలేదు. ఆ డెడ్‌లైన్‌కు కట్టుబడి ఉన్నాం. నివేదిక రూపకల్పన ప్రక్రియ శీఘ్రగతిన కొనసాగుతోంది’ అని కమిటీ సీనియర్ సభ్యుడొకరు చెప్పారు. 16న పార్టీల నాయకులతో జరిపబోయే భేటీ కేవలం అనధికారిక సమావేశమేనని, అందరికి కృతజ్ఙతలు తెలిపే సమావేశమని, గత 10 నెలలుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు అందించిన సహకారానికి వ్యక్తిగతంగా వారికి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నామని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు