మరో అవమానం!

న్యూఢిల్లీ,డిసెంబర్ 13: అమెరికాలోని మన రాయబారి మీరాశంకర్‌కు అక్కడి ఒక విమానాశ్రయంలో జరిగిన అవమానం మరిచిపోక ముందే మరో భారతీయ దౌత్యాధికారి ఆ దేశంలో అవమానం పాలైన సంఘటన వెలుగుచూసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్న హర్‌దీప్ పురిని భద్రతా తనిఖీల సందర్భంగా తలపై టర్బన్ తొలగించాలని రెండు వారాల క్రితం హూస్టన్ ఎయిర్‌పోర్టు అధికారులు ఒత్తిడి చేశారు. పురి తిరస్కరించడంతో భద్రతాధికారులు అరగంటకు పైగా ఆయన్ను వెయిటింగ్ రూమ్‌లో నిరీక్షింపజేశారు. పురితో పాటు ఉన్న ట్రాన్స్‌పోర్టేషన్  సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్  అధికారి ఒకరు జోక్యం చేసుకున్న తర్వాతే ఈ సమస్య పరిష్కారమైంది. ఈ సంఘటనపై భారత్ హూస్టన్‌లోని మన కాన్సులేట్ జనరల్ ద్వారా అమెరికా అధికారులకు తీవ్ర నిరసన తెలియజేసింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు