కాంగ్రెస్‌కు బంగారప్ప గుడ్‌బై
బెంగళూరు,డిసెంబర్ 13: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు సోమవారం ఆయన స్వయంగా ప్రకటించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ నేతృత్వంలోని జేడీఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి గల కారణాలను వివరించేందుకు ఆయన నిరాకరించారు. బంగారప్ప, దేవెగౌడ్ సంయుక్తంగా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాలు తెలిపాయి.
Comments