మంత్రి వర్గంలో మార్పులు!
న్యూఢిల్లీ,డిసెంబర్ 12: రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శనివారంనాడిక్కడ అధిష్ఠానం పెద్దలతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పొన్నా లను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను మంత్రివర్గంలోకి హోం శాఖను అప్పగించవచ్చని సమాచారం. ఇప్పడు హోం మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిని గతంలో ఆమె నిర్వహించిన గనుల శాఖకు మార్చవచ్చు. ఉప ముఖ్య మంత్రిగా దామోదర రాజనర్శింహ పేరు దాదాపు ఖాయ మైందంటున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖను రెండుగా విభజిం చాలన్న ప్రతిపాదన వుంది. పంచాయితీరాజ్‌ని బొత్స సత్యనారాయణకు, గ్రామీణాభివృద్ధి శాఖను ధర్మాన ప్రసాదరావుకు కేటాయించవచ్చు. గల్లా అరుణకుమారి రోడ్లు, భవనాల శాఖకి రావచ్చునని తెలుస్తోంది.
Comments