సరి లేరు ' కత్రినా' కెవ్వరూ..
లండన్,డిసెంబర్ 12: బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ప్రపంచంలోనే సాటిలేని మేటి సొగసుగత్తెగా వరుసగా మూడోసారి ఎంపికైంది. సమకాలీన కథానాయికలు ఫ్రీదా పింటో, ప్రియాంకా చోప్రా తదితరులను వెనక్కు నెట్టేసి అగ్రస్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన ‘ఈస్టర్న్ ఐ’ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత సొగసుగత్తెల జాబితాలో కత్రినా తనకు సాటిలేదని మరోసారి నిరూపించుకుంది. వరుసగా మూడోసారి ‘ఈస్టర్న్ ఐ’ జాబితాలో తాను అగ్రస్థానంలో నిలవడంపై కత్రినా హర్షం వ్యక్తం చేసింది. ఈ జాబితాలో ప్రియాంక చోప్రా రెండో స్థానంలో, బిపాసా బసు మూడో స్థానంలో నిలవగా, హాలీవుడ్‌కు ఎగబాకిన ఫ్రీదా పింటో నాలుగో స్థానానికే పరిమితమైంది. క త్రీనా తన నృత్యం ద్వారా అనేక మంది అభిమానుల గుండేల్లో చోటు సంపాదించిదని వెల్లడించింది. షిలా కి జవని, రాజనీతి, తీస్ మార్ ఖాన్ చిత్రాల సక్సెస్ ద్వారా ఆమె హ్యాట్రిక్ సాధించిందని ‘ఈస్టర్న్ ఐ’ పత్రిక తె లిపింది.

Comments