జగన్ 'దీక్షా' మంత్రం...
విజయవాడ,డిసెంబర్ 13 :దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం గాలికి వదిలివేసిందని మాజీ ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి విమర్శించారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో బహిరంగ సభలో ఆయన ప్రపంగించారు. 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామని రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాటను ఈ కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 21, 22 తేదీలలో విజయవాడలో 48 గంటలపాటు నిరాహాకర దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని జగన్ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ ,ఆనాడు దివంగత వైఎస్ఆర్ బందరు పర్యటనను గుర్తు చేశరు. ఆ మహానేత బందరుకు ఎంతో మేలు చేశారని చెప్పారు.
Comments