
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ కు సోమవారంతో 50 యేళ్ళు నిండాయి. అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయం లో ఎం.బి.ఏ చదివిన వెంకటేష్ సినిమా నటనకే ప్రాథాన్యమిచ్చాడు. 1986 లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా,కూలీ నంబర్-1, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం,స్వర్ణకమలం, శ్రీనివాసకళ్యాణం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,మొదలైన సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టాయి. ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన వెంకీ 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.హీరోయిన్స్ ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్ర్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు. సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్య తో ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనా తో నాలుగు సినిమాలు చేసారు. ఆర్తీ అగర్వాల్ తో మూడు సినిమాలు చేసారు. ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమల0, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందించాయి.
Comments