బందరు ఎమ్మెల్యే కు సి.ఎం.క్లాస్...!
హైదరాబాద్,డిసెంబర్ 14: బందరు శాసనసభ్యుడు పేర్ని నాని ఎట్టకేలకు తాను కాంగ్రెసు పార్టీని వీడనని ప్రకటించారు. మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం నాని తాను పార్టీని వీడనని ప్రకటించారు. 2014 వరకు కాంగ్రెసు శాసనసభ్యునిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక శాసనసభ్యునిగా నియోజకవర్గానికి ఎవరు వచ్చినా కలుస్తానని చెప్పారు. చంద్రబాబునాయుడు వచ్చినా తనను కలుస్తానన్నారు. జేపి వచ్చినప్పుడు కూడా కలిశానన్నారు. తనకు ముఖ్యమంత్రి ఎలాంటి ఆశ చూపలేదన్నారు. జగన్ తలపెట్టిన నిరాహార దీక్షలో పాల్గొనని చెప్పారు. ముఖ్యమంత్రి కలవమంటే కలిశానన్నారు. పార్టీని వీడతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. కాగా, రాజకీయాల్లో ఆవేశాలతో నిర్ణయాలు తీసుకోవద్దని, కేరీర్ ను పాడు చేసుకోవద్దని కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు హితబోథ చేసినట్టు తెలిసింది.
Comments