టిఆర్ఎస్,టీడీపీ సభ్యుల సస్పెన్షన్...
హైదరాబాద్,డిసెంబర్ 14: విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని ఆందోళన చేస్తూ పోడియం వద్దకు వచ్చిన 9 మంది టిఆర్ఎస్ సభ్యులను ఉదయం శాసనసభ సమావేశాల నుంచి ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ సస్పెండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించి, అంత తీవ్రంగా లేనివాటిని, వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నచ్చచెప్పారు. అయినప్పటికీ టిఆర్ఎస్ సభ్యులు వినలేదు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దాంతో ఆందోళన చేస్తున్న టిఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి రఘువీరా రెడ్డి సభలో తీర్మానం ప్రవేశం పెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ, ఉదయం సమావేశం నుంచి వారిని సస్పెండ్ చేశారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయనందుకు నిరసనగా శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ, సిపిఐ, బిజెపి సభ్యులు వాకౌట్ చేశారు.
ఇక సాయంత్రం సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. చంద్రబాబు సహా టీడీపీ సభ్యులను ఈ సాయంత్రం సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పావుగంట వాయిదా తర్వాత శాసనసభ సాయంత్రం తిరిగి ప్రారంభమయింది. టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే ఆంధ్రప్రదే శ్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. అయితే టీడీపీ సభ్యులు పట్టువీడకపోవడంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధరబాబు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Comments