రాష్ట్రంలో త్వరలో బి.జె.పి చానెల్ ?
హైదరాబాద్,నవంబర్ 18: రాజకీయంగా ఎదుగుదలకు, విజయానికి స్వంత టీ.వీ.చానెళ్ళు పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్న రాజకీయ పార్టీల బాటలో రాష్ట్ర బీ.జె.పీ. కూడా తనకో స్వంత చానెల్ వుండాలని గట్టిగా భావిస్తోంది. రాష్ట్ర బీ.జె.పీ. అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు విశ్వసనీయ సమాచారం. కేవలం బీ.జె.పి. మౌత్ పీస్ గా గాకుందా తన అజెండా కు పార్టీ ప్రయోజనాలను జొడించి భావ సారూప్య వర్గాల సహకారం తో కొద్ది నెలలలో చానెల్ ప్రారంభించనున్నట్టు కిషన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. రాష్త్రంలో ప్రస్తుతం వున్న చానెళ్ళలొ కొన్ని కాంగ్రెస్, కొన్ని తెలుగు దేశం పార్టీలకు అనుకూలం గా పనిచేస్తున్నాయనేది జగమెరిగిన సత్యం.అందుకే టీ.ఆర్. ఎస్. తనకో చానెల్ ఏర్ఫాటు చేసుకుంది. ప్రజారాజ్యం పార్టీ అద్యక్షుడు చిరంజీవి కూడా ఒక చానెల్ నిర్వహణలో ప్రధాన భాగస్వామిగా వున్నారు. అఫ్ కోర్స్ ఈ చానెల్ వార్తా విభాగం ఇటీవలే మూత పడింది. అయినప్పటికీ చిరు, ఆయన కుటుంబ సభ్యుల సినిమాలు ,ఇతర కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రసారం చేస్తోంది. ఈ నేపధ్యంలో తమ నాయకత్వానికి, పార్టీకి వెన్నుదన్ను గా చానెల్ పెట్టాలని కిషరెడ్డి భావిస్తున్నారేమో.

Comments