స్వామియే...శరణమయ్యప్పా...
కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయ ద్వారాలను పూజారులు మంగళవారం తెరిచారు. అయ్యప్ప స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. కార్తీకమాసంలో భక్తులు అయ్యప్ప మాలలు ధరించి శబరిమలకు వస్తారు. స్వామిని దర్శించుకుని దీక్షలు విరమిస్తారు. సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనం తో ఈ సీజను కు అయ్యప్ప దీక్షలు ముగుస్తాయి.


Comments