అట్లాంటాలో అయ్యప్ప పూజలు
అట్లాంటా,నవంబర్ 18: అట్లాంటాలోని శివమందిరంలో దాదాపు 400మంది ప్రవాసాంధ్ర అయ్యప్ప భక్తులు పాల్గొని అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. వర్జీనియా, దక్షిణ కరోలినా, టిన్నెస్సీ ,అలబామా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుస్వాములు ముదిగొండ కిరణ్, మేడిచెర్ల రవికుమార్‌లు పూజా కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ, సంకీర్తనలు, శోభయాత్ర, శివహారతి, 18మెట్ల హారతి నిర్వహించారు.

Comments