రాఖీ కా ఇన్సాఫ్ టీవీ షో పై కేంద్ర ప్రభుత్వం కొరడా
న్యూఢిల్లీ,నవంబర్ 17: రాఖీ కా ఇన్సాఫ్, బిగ్ బాస్ టీవీ షోలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ప్రేక్షకుల నుంచి, మహిళా సంఘాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆ రెండు టీవీ షోలపై ఆంక్షలు విధించింది. ఈ రెండు షోలను రాత్రి 11 గంటల నుంచి మర్నాడు తెల్లవారు జామున 5 గంటల మధ్య మాత్రమే ప్రసారం చేయాలని ఆదేశించింది.ఆ రెండు షోలు కూడా అందరూ చూడడానికి ఉద్దేశించినవి కావని, నిర్ణీత సమయాల్లోనే వాటిని ప్రసారం చేయడం మంచిదని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఈ షోలను ఇతర సమయాల్లో పునప్రసారం చేయకూడదని, న్యూస్ ప్రోగ్రామ్ ల్లో కూడా ప్రసారం చేయవద్దని ఆదేశించింది. బిగ్ బాస్ కలర్స్ చానెల్ లో ప్రసారమవుతుండగా, రాఖీ కా ఇన్సాఫ్ ఎన్డీటివి ఇమాజిన్ లో ప్రసారమవుతోంది. నగ్న దృశ్యాలను ప్రసారం చేస్తుందనే ఆరోపణలపై ఎస్ఎస్ మ్యూజిక్ చానెల్ ప్రసారాలపై ఏడు రోజుల పాటు నిషేధం విధించింది.
Comments