స్టే తెచ్చుకున్న కలర్స్ ‘బిగ్‌బాస్’
ముంబై,నవంబర్ 18 : వివాదస్పద ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోను రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ జారీ చేసిన ఆదేశాలపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. బిగ్‌బాస్, రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాలని కేంద్రం బుధవారం ఆదేశించింది. దీంతో బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న కలర్స్ చానల్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
Comments