మన్మోహన్ సింగ్ ను ఇంకా వెంటాదుతున్న స్పెక్ట్రమ్ కుంభకోణం

న్యూఢిల్లీ,నవంబర్ 17: టెలికాం మంత్రి ఎ. రాజా రాజీనామా చేసినా ప్రధాని మన్మోహన్ సింగ్ ను స్పెక్ట్రమ్ కుంభకోణం ఇంకా వెంటాదుతోనే వుంది. ప్రధాని అలసత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్షింతలు టెలికాం మంత్రి ఎ.రాజా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని మంజూరుచేయాలన్నకేంద్రమాజీ మంత్రి సుబ్రమణ్యంస్వామి విజ్ఞాపనపై నిర్ణయం తీసుకోవడంలో ప్రధాని ప్రదర్శించిన జాప్యాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. జనతాపార్టీ అధ్యక్షుడు, కేంద్రమాజీ మంత్రి సుబ్రమణ్యంస్వామి దాఖలుచేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ జి.ఎస్‌.సింఘ్వి, జస్టిస్‌ ఎ.కె.గంగూలీల నేతృత్వంలోని బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ గోపాల్‌ సుబ్రమణ్యం బెంచ్‌ నుంచి కఠిన ప్రశ్నల్ని ఎదుర్కొనాల్సి వచ్చింది.నిష్పక్షపాత, సుపరిపాలన కలిగిన ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్దేశించిన మూణ్నెల్ల గడువులోగా అనుమతి మంజూరుచేయడం సాధ్యమే. ఇప్పటికే 16 నెలలు గడిచిపోయింది. అనుమతి ఇవ్వడం నాకు ఇష్టంలేదని సంబంధిత అథారిటీ చెప్పొచ్చు. సానుకూలంగానో, వ్యతిరేకంగానో స్పందించొచ్చు. కానీ నిష్క్రియ, మౌనం అనేవి ఇబ్బందికరంగా మారాయని మేం  గమనించాం, సుబ్రమణ్యంస్వామి నుంచి ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా సంబంధిత అథారిటీ(ప్రధాని) చర్యలు ప్రారంభించి ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని హవాలా వ్యవహారానికి సంబంధించిన వినీత్‌ నారాయణ్‌ కేసు తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్న విషయాన్ని న్యాయమూర్తులు గుర్తుచేశారు. కాగా,
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేస్తున్నారని వచ్చిన వార్తలను ప్రధాన మంత్రి కార్యాలయం(పిఎంఓ) ఖండించింది. 2జి స్పెక్ట్రమ్ స్కామ్'పై నిర్ణయం తీసుకునే విషయంలో ప్రధాన మంత్రి జాప్యం చేయడంపై సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన నేపధ్యంలో ప్రతిపక్షాలు ప్రధానమంత్రిపై వత్తిడి పెంచాయి. దాంతో ప్రధాని రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లను ప్రధాని కార్యాలయ వర్గాలు ఖండించాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు