Tuesday, October 26, 2010

అరుంధతీరాయ్ సంజాయిషీ

నూఢిల్లీ,అక్టోబర్ 26: తన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుండటంతో అరుంధతీరాయ్ స్పందించా రు. న్యాయం కోసమే తాను అలా మాట్లాడినట్లు పేర్కొన్నా రు. శ్రీనగర్‌లో ఉన్న ఆమె మంగళవారం ఈ మేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల కారణంగా నన్ను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసే అవకాశం ఉందని పత్రికల్లో వచ్చింది. ఇక్కడి లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజూ అనుకునే విషయాన్నే నేను చెప్పాను. నావి భారత్‌ను విచ్ఛిన్నం చేసేవిధంగా ఉన్న అనుచిత ప్రసంగాలని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. కానీ అది సరికాదు. మతం పేరుతో హత్యలు చేస్తున్నవాళ్లు, కార్పొరేట్ కుంభకోణాలకు పాల్పడే వ్యక్తులు, రేపిస్టులు, పేదలను పీక్కుతినే దోపిడీగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ సమాజంలో... న్యాయం కోసం ఎలుగెత్తుతున్నవారి గొంతు నొక్కి, జైలులో పెట్టాలని చూస్తున్న దేశాన్ని చూసి జాలిపడుతున్నాను’ అని అరుంధతి తన లేఖలో పేర్కొన్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో వేర్పాటువాదానికి అనుకూలంగా, దేశవిభజనను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారని వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ, ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌ పై ఆరోపణలు వచ్చాయి. అనంతరం కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని, ఇది చారిత్రక వాస్తవమని, భారత్ కూడా ఈ విషయాన్ని అంగీకరించిందని రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో గిలానీ, రాయ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...