విదేశీ కార్గో విమానాలపై నిఘా
న్యూయార్క్,అక్టోబర్ 29: ఎమెన్ నుంచి చికాగో వచ్చే కార్గో విమానంలో ప్రేలుడు పదార్ధాలతో కూడిన అనుమానాస్పద ప్యాకేజీని కనుగొనడంతొ అమెరికా లోని కొన్ని విమానాశ్రయాలలో ఫెడరల్ దర్యాప్తు అధికారులు కార్గో విమానాల తనిఖీలు చేపట్టారు. కాగా,ఇంగ్లండ్ లోని బర్నింగ్ హాం విమానాశ్రయంలో కనుగొన్న అనుమానాస్పద ప్యాకేజ్ లోని వస్తువులు హానికరమైనవి కావని నిర్ధారించారు. నెవార్క్ లిబర్టీ, ఫిలడల్ఫియా ఇంటర్నేషనల్ విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments