Sunday, October 24, 2010

క్రీడాకారుడు,ఆర్చరీ కోచ్ చెరుకూరి లెనిన్ దుర్మరణం



విజయవాడ,అక్టోబర్ 24: భారత క్రీడారంగం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయింది. 27 ఏళ్ల వయసులోనే క్రీడాకారుడిగా, ఆర్చరీ కోచ్‌గా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన తెలుగుతేజం చెరుకూరి లెనిన్... విజయవాడ సమీపంలోని జూపూడి గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కామన్వెల్త్ క్రీడల్లో లెనిన్ పర్యవేక్షణలో భారత జట్టు రజత పతకం సాధించింది. ఇందుకు గౌరవంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు లెనిన్ హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని స్వస్థలం విజయవాడకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.వారి కరు ఆటోను ధీకొని బోల్తా పడింది. లెనిన్‌తో పాటు కారులో ఉన్న అతడి శిష్యుడు, కామన్వెల్త్ పతక విజేత రితుల్ చటర్జీ ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో కారులో ఉన్న లెనిన్ తండ్రి సత్యనారాయణ, క్రీడాకారుడు కళ్యాణ్ కూడా స్వల్పగాయాలతో బయటపడ్డారు. రెండేళ్ల క్రితమే లెనిన్‌కు వివాహమైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...