భారీ నష్టాల్లో అమెరికా స్టాక్‌మార్కెట్
న్యూయార్క్,అక్టోబర్ 19: అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన సూచీలు భారీగా పతనమయ్యాయి.. ప్రధాన సూచీలు డోజోన్స్ 165 పాయింట్లు, నాస్‌డాక్ 43, ఎస్ అండ్ పీ 19 పాయింట్లు నష్టాన్ని చవిచూశాయి. దాంతో సూచీలన్ని ఆగస్ట్ 11 నాటి కనిష్ట స్థాయికి దిగువన ముగిశాయి. డోజోన్స్ 11139 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఓదశలో 10920 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. చివరికి డోజోన్స్ 10978 పాయింట్ల, నాస్‌డాక్ 2435, ఎస్ అండ్ పీ 1165 పాయింట్ల వద్ద క్లోజైంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆపిల్, ఐబీఎం కంపెనీల ఆర్ధిక ఫలితాలు నిరాశ పరచడంతో సూచీలన్ని భారీగా నష్టపోయాయి.
Comments