విదేశీ విద్యార్థుల కోసం ఆసీస్ వెబ్‌సైట్
మెల్‌బోర్న్,అక్టోబర్ 20: తమ దేశంలో విద్యనభ్య సించాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించి అన్ని వివరాలతో వెబ్‌సైట్ ప్రారంభించింది. ఎక్కడ చదవాలి, పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి, ఏ యూనివర్సిటీలో చేరాలి, ప్రయాణ వివరాలు, యూనివర్సిటీల రేటింగ్ గురించి సమస్త సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. యూని ఆస్ట్రేలియా అనే కంపెనీ ఈ వెబ్‌సైట్ ప్రారంభించింది. ఆసీస్‌లోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉందని యూని ఆస్ట్రేలియా సీఈవో రొవాన్ కుంజ్ తెలిపారు. తమ దేశంలో ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు తమ వెబ్‌సైట్ http://www.uniaustralia.com.au/ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
Comments