హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్ట్ కోసం ఆరు ఇంజనీరింగ్ కంపెనీల ఎంపిక
హైదరాబాద్,అక్టోబర్ 20; నగరానికి తలమానికంగా నిలిచే మెట్రోరైలు ప్రాజెక్ట్ పనుల కోసం ఆరు ఇంజనీరింగ్ కంపెనీలను రెండవ రౌండ్ బిడ్ కొరకు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ పనులను చేయడానికి ప్రతిపాదనలను కోరడంతో ప్రపంచవ్యాప్తంగా 17 కంపెనీలు తమ ప్రతిపాదనలను పంపాయని మెట్రో ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఏకామ్(హాంకాంగ్)తో కలిసి ఆర్వీ అసోసియేట్స్ (హైదరాబాద్); ఇటాఫేర్ ఎస్‌పీఏ (ఇటలీ)తో కలిసి సాయి కన్‌సల్టింగ్ ఇంజనీర్స్ (ఆహ్మాదాబాద్); లూయిస్ బెర్జర్ (ఇండియన్ అవుట్‌ఫిట్ ఆఫ్ అమెరికా కంపెనీ); మాట్ మెక్‌డొనాల్డ్ (ముంబై, ఇండియన్ అవుట్‌ఫిట్ ఆఫ్ యూకే); పార్సన్స్ బ్రింకర్‌హాఫ్ (ఇండియన్ అవుట్‌ఫిట్ (అమెరికా))ల భాగస్వామ్యంతో యూఎమ్‌టీసీ(న్యూఢిల్లీ); స్కాట్ విల్సన్ (యూకే), స్కాట్ విల్సన్ ఇండియా(న్యూఢిల్లీ) కంపెనీలను ప్రతిపాదిత విజ్ఞప్తుల రౌండ్‌లో ఎంపిక చేశారు. కన్‌సల్టెన్సీ సంస్థల నైపుణ్యం, అనుభవాన్ని పరిశీలించనున్నట్టు ఆధికారులు తెలిపారు. రెండవ రౌండ్‌లో సంస్థల ఆర్ధిక పరిస్థితిని అంచనావేస్తామన్నారు.
Comments