వైభవంగా వివేక్ ఒబెరాయ్ వివాహం
బెంగళూరు,అక్టోబర్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ వివాహం కర్ణాటక దివంగత మాజీ మంత్రి జీవరాజ్ ఆళ్వా కూతురు ప్రియాంక ఆళ్వాతో ఇక్కడ వైభవంగా జరిగింది. 28 ఏళ్ల ప్రియాంక బ్రిటన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ పట్టా పుచ్చుకున్నారు. నగర శివార్లలోని నాగవారలో ఆళ్వా కుటుంబానికి చెందిన విలాసవంతమైన ఫాం హౌస్‌లో కర్ణాటక, పంజాబీ శైలిలో వివాహం జరిగింది.
Comments