వర్మ-చిరు కాంబినేషన్?
ఇంతకు ముందు చిరుతో చూడాలనివుంది సినిమాను వర్మ మధ్యలోనే ఆపేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్పర్థలు వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, వర్మతో చిరంజీవికి జోడి కుదరడం చాలా కష్టమని, వర్మ మెంటాల్టి చిరుతో సినిమా తీయడానికి అసలు సరిపోదని పీఆర్‌పీ వర్గాలు అంటున్నాయి. రక్తచరిత్ర వివాదాలను జనం మరిచిపోవడానికి వర్మ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడనే అనుమానాన్ని పీఆర్‌పీ నేతలు వ్యక్తం చేశారు. నేరుగా చిరంజీవితో చర్చించ కుండా ట్విట్టర్‌లో వెల్లడించి మీడియాద్వారా ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
Comments