Friday, October 29, 2010

ఆసియా క్రీడలకు హరికృష్ణ, హారిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడలకు ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి అందుబాటులో ఉండడంలేదని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధికారులు ప్రకటించారు. ముందుగా ఖరారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఆసియా క్రీడలు జరిగే సమయంలో ఆనంద్, హంపి వేర్వేరు టోర్నమెంట్‌లలో బరిలోకి దిగనున్నారు.  ఆనంద్, హంపి ఆడని కారణంగా... ఇటీవల రష్యాలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న జట్లనే ఆసియా క్రీడల్లోనూ ఆడించాలని భారత చెస్ సమాఖ్య నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. నవంబర్ 12 నుంచి 27 వరకు చైనాలోని గ్వాంగ్‌జూలో జరిగే ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్‌తోపాటు ర్యాపిడ్ విభాగంలో పోటీలుంటాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...