Sunday, October 24, 2010

ఐటీ రంగంలో జోరందుకున్న. నియామకాలు

న్యూఢిల్లీ,అక్టోబర్ 24: భారత ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో రెండంకెల రాబడుల వృద్ధి నమోదు కావడంతో ఈ రంగాల్లో భారీ నియామకాలకు తెర లేవనున్నది. అమెరికా, ఐరోపా మార్కెట్లలో డిమాండ్ పుంజుకోవడంతో టీసీఎస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు భారీ హైరింగ్ ప్లాన్లకు సిద్ధం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 30 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గతంలో లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సవరించి ఆ సంఖ్యను 50 వేలకు పెంచింది. ఇన్ఫోసిస్ కూడా ఇదే విధంగా తన కొత్త ఉద్యోగుల నియామక లక్ష్యాన్ని సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36 వేల మంది కొత్త వాళ్లను తీసుకోవాలనుకున్న ఈ కంపెనీ తర్వాత దానిని 40 వేలకు పెంచింది. నాలుగేళ్లలో దేశీయ ఐటీ సర్వీసుల మార్కెట్ 1,360 కోట్ల డాలర్లకు చేరుతుందని ప్రముఖ రీసెర్చ్ గ్రూప్ గార్ట్నర్ తెలిపింది. 2009లో 900 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2014 కల్లా 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని వివరించింది. ఈ వృద్ధితో చిన్న, మధ్య తరహా దేశీయ ఐటీ కంపెనీలకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...