రజనీ-కమల్‌+ శంకర్‌=?

చెన్నై: రజనీతో ‘శివాజీ’, తాజాగా ‘రోబో’ చిత్రాలను,కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు’ రూపొందించిన సంచలన దర్శకుడు శంకర్‌ తన తాజా చిత్రాన్ని రజనీ-కమల్‌హాసన్‌ల కాంబినేషన్‌లో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.అపజయమే ఎరుగని దర్శకుడిగా శంకర్‌కున్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇక రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ల గురించి చెప్పేదేముంది .. ఇద్దరూ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినవాళ్లే. ఇద్దరూ ఒకేసారి కెరీర్‌ ప్రారంభించినవాళ్లే. కెరీర్‌ తొలినాళ్లలో వీళ్లిద్దరూ కలిసి ఓ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో రీమేక్‌ చేయబడిన ‘ఇది కథ కాదు’ తమిళ మాతృకలో తెలుగులో చిరంజీవి చేసిన క్యారెక్టర్‌ను రజనీకాంత్‌ చేసారు. రెండు భాషల్లోనూ కమల్‌హాసన్‌ నటించారు. ఆ చిత్రం కాకుండా కమల్‌-రజనీ కలిసి మరో రెండు చిత్రాల్లో నటించారు. అవి.. ‘అందమైన అనుభవం’, ‘వయసు పిలిచింది’. ఆ తర్వాత ఇద్దరూ సూపర్‌స్టార్స్‌గా అవతరించారు. రజనీతో పోల్చితే.. ప్రస్తుతం కమల్‌హాసన్‌కున్న స్టార్‌డమ్‌ కాస్తంత తక్కువే అయినా.. ఒక నటుడిగా కమల్‌కున్న ఫాలోయింగ్‌ చిన్నదేమీ కాదు. దక్షిణాదిలోని అన్ని భాషా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ ప్లస్ శంకర్ కలయికలో ఓ సినిమా రూపొందడమంటే నిజంగా అది పెద్ద సంచలనమే. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు