వర్మ రక్తచరిత్ర..నేపధ్యం...
పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న ని రాయలసీమ లోని అన్ని జిల్లాలలొ ఒక దేవుడుగా కొలుస్తారంటే అతిశయొక్తి కాదేమో.5 సార్లు అనంతపురం జిల్లా లొని పెనుకొండ నియొజకవర్గానికి ఎం.ఎల్.ఏ. గా ప్రాతినిద్యం వహించారు.రవన్న పెనుకొండ నియోజకవర్గములొని వెంకటాపురం గ్రామములొ 28-5-1957 న జన్మించాడు.రవన్న తండ్రి శ్రీరాములు 300 ఎకరాల భూసామి. తన భూమినంతా కమ్యునిస్ట్ సిద్దంతాల ప్రేరణ తొ పేదలకు(బొయా,కురుబ,ఈడిగ కులస్తులు) పంచిపెట్టారు.పేద ప్రజల భూములను కనగానపల్లి, చెన్నెకొత్తపల్లి భూస్వాములు ఆక్రమించుకొన్నారు.ఆ భూస్వాములే గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నా రెడ్డి.వారి నుంచి 600 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు పొందేటట్టు పొరాటం చేసి వారికి సాధించి పెట్టారు శ్రీరాములు. 1971 లొ సిపీఇ(ఎం.ఎల్) పార్టీ లొ చేరి అనతి కాలంలొనే వుద్యమ నాయకుదుగా గుర్తింపు పొందారు. ఈ భూముల పంపకం వరస హత్యలకు, కుల పొరాటాలకు శ్రీకారం చుట్టింది.29/05/1975 న శ్రీరాములు ను ఆయన అనుంగు సహచరుడుతొ గంగుల నారాయణ రెడ్డి, సానే చెన్నా రెడ్డి చంపించారు.రవన్న అన్న హరన్న(పరిటాల హరింద్ర) తండ్రి అడుగుజాడల లొనే పేదలకు చేరువ అయ్యాడు.ఇది సహించలేని గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నారెడ్డి కబీర్ అనే ఇనస్పెక్టర్ తొ హరన్నను ఎన్కౌంటర్ చేయించారు.నక్సలైట్లు 1982-1983 కాలములొ గంగుల నారాయణ రెడ్డి, నరసన్న, యాది రెడ్డి లను చంపేశారు.కాని ప్రత్యర్థులు ప్రతీకారంతొ రవన్న ఈ హత్యలు చేయించాడని అనుకొంటారు.రవన్న తన మేనమామ కొండన్న సాయముతొ 1991 వరకు అజ్ఞాతంలోనే వున్నాడు.నారాయణ రెడ్డి ని నక్సలైట్లు అనతపురం లాడ్గి లొ వుండగా చంపెస్తారు.నారాయణ రెడ్డి చనిపొయిన తేరువాత, 1982, 1985 లొ పెనుకొండ ఎం.ఎల్.ఏ. గా తేలుగుదేశం పార్టి తరుపున రామచంద్రా రెడ్డి గెలిచాడు.1989 ఎలక్షన్లలొ పెనుగొండ నియోజకవర్గం సానే చెన్నారెడ్డి వశమయింది.అప్పుడు కాంగ్రెస్ గవెర్నమెంట్ యేర్పడింది. అప్పుడు సానే చెన్నారెడ్డి కొడుకులు రమణారెడ్డి,ఒబులరెడ్డి , గంగుల నారాయణరెడ్డి కొడుకు గంగుల సూర్య నారాయణరెడ్డి సాగించిన హత్యలతొ అరాచకాలతొ మానభంగాలతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.ఈ గంగుల సూర్యనారాయణరెడ్డి మద్దెలచెర్వు గ్రామములొ ఒక కురుబ( యువతి ని , ఒక ప్రభుత్వొద్యొగి ని వారి తల్లిదండ్రుల ఎదుటే మానభంగం చేసాడంటారు.రవన్న తన తండ్రి,అన్నయ్య ల హత్యలకి బదులు తీర్చుకొవాలనుకొని 1991లొ నక్సలైట్ల సహాయం కోరతాడు.నక్సలైట్లు కూడ తమ నాయకులను(శ్రీరాములు,హరన్న)లను పొగుట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకొవాలునుకొంటారు.ఆ ప్రయత్నాలలొ భాగం గానే, 1991 లొ సానే చెన్నారెడ్డి ధర్మవరం లొని తన ఇంట్లొ కుర్చీ లొ కూర్చుని పేపర్ చదువుతుండగా నక్సలైట్లు పొలీసు దుస్తుల్లొ వచ్చి చంపి వెళ్ళిపొతారు.తిరిగి కాంగ్రెస్ రమణారెడ్డి(సానే చిన్నారెడ్డి పెద్ద కొదుకు) కి టిక్కెట్ ఇచ్చి భారీ రిగ్గింగులతో గెలిపిస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ ఒబుల రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి ఎన్నో అరాచకాలు సాగించారు. అప్పట్లొ నక్సలైట్ల లొ చీలికలు వచ్చాయి. దాని తరువాత గంగుల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లొ నక్సలైట్లు టీ.వీ. లొ బాంబు అమర్చి అతని సోదరులను చంపుతారు. ఈ దాడిలొ ప్రముఖుడుగా నక్సలైట్ల లో ఒక విభజన వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న పోతుల సురేష్ పాత్ర వుందంటారు.ఈ గ్రూప్ పేరు రీఆర్గనిగింగ్ కమిటీ.రెండో వర్గమైన రెడ్ స్టార్ కి సుదర్శన్ నాయకుడు.అప్పటి నుంచి ఆర్.ఓ.సి. రవన్న కి తోడుగా నిలిస్తె, రెడ్ స్టార్ గంగుల సంతానానికి సహాయము చేస్తూ వచ్చింది.ఈ రెండు గ్రూపుల పొరాటాల మధ్య సుమారు 40 మంది మ్రుత్యువాత పడ్డారు. టీ.వీ. బాంబు పెలుదులొ గంగుల సూర్యనారాయణ రెడ్డి తప్పించుకున్న గంగుల సూర్యనారాయణ రెడ్డి కొన్నాళ్ళు కర్నాటక లొ తల దాచుకొన్నాడు.అక్కదే భానుమతి తో వివాహము జరింగింది.రాజకీయాలతొ పీడిత బడుగు బలహీన వర్గాలకి ప్రయోజనం చేకూర్చాలని జన జీవన స్రవంతి లొ అడుగు పెడతాడు రవన్న.తెలుగుదేశం పార్టి తరపున 1993 ఎలక్షన్లలొ పెనుకొండ నియోజక వర్గానికి రమణారెడ్డి పై ఎటువంటి హింసా లెకుండా అత్యదిక మెజారిటి తొ గెలిచాడు.1994 లొ కార్మిక శాఖా మంత్రిగా పని చేసాడు.తర్వాతి కాలములొ లక్ష్మి పార్వతి అనంతపురం జిల్లా రాజకీయాల పై మితిమీరిన జొక్యం కారణంగా కొన్నాళ్ళు తెలుగుదేశం పార్తి కి దూరంగా వున్నాడు.1995 లొ కూడా రవన్న కే పెనుకొండ టిక్కెట్ ఇచ్చారు.అప్పుడూ పెనుకొండ నియొజక వర్గ ప్రజలు రవన్న కే పట్టం కట్టారు.అప్పుడూ ప్రత్యర్థి రమణారెడ్డే.1996 లొ నందమూరి తారక రామారావు మరణం తర్వాత రవన్న ఎన్.టీ.ఆర్. తెలుగుదేశం పార్టి కి రాజీనామా చేసి తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదే రమణా రెడ్డి పై మరలా విజయ దుందుభి మోగించాడు. 1996 లొ ఆర్.ఓ.సి. ఒబుల రెడ్డి అరాచకాలకు ఒక ముగింపు నివ్వాలన్న వుద్దెశ్యముతొ అతని కొసం వెదుకులాట సాగిస్తుంది.ఒబులరెడ్డి హైదరాబాద్ నగరములొ వున్నట్టు సమాచారం అందుకొని హైదరాబాద్ లొని ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం చేస్తుండగా అతని ని,అతని నలుగురు అనుచరులను చంపుతారు. రవన్న పై ప్రతీకారం తీర్చుకోవడానికి అదను కొసం చూస్తున్న సూరి 1997 లొ రవన్న తన తండ్రి పరిటాల శ్రీరాములు మీద సినిమా తీయాలని హైదరాబాదు లొని జుబ్లీ హిల్స్ రామానాయుడు స్టూడియో లొ ముహూర్తం సన్నివెశం షూటింగ్ చే స్తుండగా,శక్తివంతమైన రిమోట్ కంట్రోల్ కారు బాంబు ని పేల్చాడు సూరి. ఆ పేలుడు లొ టీవి నిపుణులతొ సహ 26 మంది మరణించారు.30 మంది గాయపడ్డారు. ఈ కేసు పై పొలీసులు తీవ్రంగా దర్యాప్తు చేసి కర్నాటక లొ తల దాచుకున్న సూరి ని పట్టుకుని చర్లపల్లి జైలుకి పంపారు.1999 లొ ఒబులరెడ్డి అన్న రమణారెడ్డి ని హైదరాబాదులొని అతని స్నేహితుడి ఇంట్లొ పార్టి జరుగుతుండగా ఆర్.ఓ.సి. గ్రూపు కాల్చి చంపారు.రవన్న తిరిగి 1999 ఎలక్షన్స్ లొ ఎటువంటి హింసా,రిగ్గింగులు లేకుండా తెలుగుదేశం పార్టి తరపున గెలుస్తాడు. జైలు నుంచి సూరి ఒకసారి అనతపురం లొని రవన్న ఇంటిని పేల్చివేయటానికి కుట్ర పన్నుతాడు.రవన్న ఈ కుట్ర ని పొలీసులకి చెప్పి సూరి మీద అతనికి సాయపడిన ఒక కాంగ్రెస్ యువ నేత పైన కేసు పెడతాడు. తరువాత రవన్న ఒకసారి పేద అవివాహిత జంటలకు వెంకటాపురం లొ వివాహాలు జరిపిస్తాడు.రవన్న అనుచరులు ముగ్గురు కారు లొ వెంకటాపురం వస్తుండగా సూరి అనుచరులు దారి కాచి చంపుతారు.2004 ఎన్నికలలొ భానుమతి కి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తారు.సుదర్శన్ నాయకత్వంలొని రెడ్ స్టార్ నక్షలైట్లు రవన్న ని ఎలక్షన్ ప్రచారం లొ చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ 24000 వొట్ల మెజారిటి తొ రవన్న గెలుస్తాడు.అదే ఎలక్షన్స్ లొ తెలుగుదేశం పరాజయం పాలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3వ రొజు నుండి తెలుగుదేశం పార్టి కార్యకర్తల,రవన్న అనుచరుల హత్య లతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.అప్పటినుంది పరిటాల రవన్న జీవితం ప్రమాదం లొ పడింది. ప్రతి 15 రొజులకు ఒక సారి అనంతపురం, వెంకటాపురం ఇళ్ళల్లొ సొదాలు జరిపించి మానసికంగా కుంగదీశారు.అదే సమయంలొ సూరి గ్యాంగ్ పరిటాల రవి సన్నిహితుడు కార్పొరేటర్ అయిన భాషా ను జూన్ 2004 లొ ధర్మవరం లొ చంపేసారు. మరో సన్నిహితుడు, సొమందేపల్లి జెడ్.పి.టి.సి. మెంబర్ అయిన ఆది నారాయణ ను చంపేసారు.ఆ తర్వాత తగరకుంట ప్రభాకర్ ని, బళ్ళారి లొ ఆర్.కే. ని సూరి అనుచరులు జూలకంటి శ్రీనివాసరెడ్డి(మొద్దు శీను),దామోదరరెడ్డి,భాస్కరరెడ్డి కలిసి చంపేసారు. సొమందేపల్లి ఉప ఎన్నికలకు రవన్న వస్తే చంపెందుకు పథకం పన్నారు.అనంతపురం డీ.ఎస్.పీ. సాయంతొ రవన్న ముఖ్య అనుచరులైన పావురాల క్రిష్ణ అతని సోదరుడిని చంపేసారు.అప్పట్లొ సూరి కి ఎవరితొ మాట్లాడాలన్న, సెల్ ఫొన్లు అవసరం వచ్చినా,ఎవరినన్నా కలవాలన్నా జైలు అధికారులు బాగా సహకరించేవారు.అనంతరం 2005 జనవరి 24న అనతపురం లొని తెలుగుదేశం పార్టి ఆవరణలొ సూరి అనుచరుల తూటాలకు రవి బలయ్యాడు.ఈ భీతావాహ సంఘటనతొ రవన్న అభిమానులు, తెలుగుదేశం పార్టి కార్యకర్తలు తమ నాయకుడి ని కొల్పొయిన దుఖం తొ ఆవేశం తో 60 కోట్ల నష్టాన్ని కలగచేసారు.
Comments
I have gone through your blogspot,
varthalu updating is very nice. So you are not wasting your time in US.
--Samayamantri Srihari Rao