నిరుడు అరకొర...ఈసారి కుండపోత

విశాఖపట్నం,అక్టోబర్ 24 : గత సంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు భిన్న ప్రభావం చూపాయి. వీటి ప్రభావంతో నిరుడు అరకొర వానలు పడగా, ఈ ఏడాది కుండపోత వర్షాలు కురిశాయి. రాష్ట్రాన్ని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాలుగా మూడు డివిజన్లుగా విభజించిన వాతావరణ శాఖ, వాటికి సగటు వర్షపాతాన్ని నిర్దేశించింది. ఇందులో నైరుతి రుతుపవనాల సీజను (జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకూ) మొత్తమ్మీద సగటున 574.46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి.అయితే గత సంవత్సరం రాష్టవ్య్రాప్తంగా 439.23 మి.మీల వానతో సగటున 20 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆరంభం నుంచీ ఆశాజనకంగానే ఉన్నాయి. వీటికి మధ్యలో అల్పపీడనాలు కూడా తోడయ్యాయి.రాష్ట్రంలోని మూడు డివిజన్లలోనూ సాధారణానికి మించి వర్షాలు కురిశాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు