Tuesday, October 26, 2010

ఇండోనేసియా భూకంపంలో భారీ ప్రాణ నష్టం

జకార్తా,అక్టోబర్ 26: ఇండోనేసియా పశ్చిమ తీరం మరోసారి సునామీ గుప్పిట్లో విలవిల్లాడింది. సునామీ ధాటికి మారుమూల ద్వీపాల్లో 113 మంది మృతిచెందగా, 500 మందికిపైగా గల్లంతయ్యారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. సుమత్రా దీవులకు పశ్చిమంగా సోమవారం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం కారణంగా మెంతావై ద్వీపసముదాయంలోని పాగాయ్, సిలాబూ ప్రాంతాల్లో సునామీ సంభవించింది. పదడుగుల ఎత్తులో భారీ అలలు ఎగసిపడ్డాయని, వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయని ప్రభుత్వ ప్రతినిధి ముజిహార్తో మంగళవారం తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీకి కారణమైన పెను భూకంప కేంద్రం కూడా పశ్చిమ సుమత్రా తీరంలోనే నమోదైంది. నాటి ప్రకృతి బీభత్సంలో 1.70 లక్షల మంది ఇండోనేసియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేసియా ఖండాంతర శిలాఫలకాలు క్రియాశీలంగా ఉన్న ప్రాంతంలో ఉండడంతో అక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవిస్తున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...