Wednesday, October 20, 2010

విశాఖ వన్ డే లో భారత్ గెలుపు

Kohli takes India to victoryవిశాఖపట్నం,అక్టోబర్ 20: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్లు తేడాతో గెలిచింది. 290 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఇంకా ఓవర్ మిగిలి వుండగానే విజయం సాధించింది. భారత్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ నిరాశ పరిచినప్పటికీ విరాట్ కోహ్లి ,రైనా,యువరాజ్ సింగ్ జట్టు విజయంలో కీలక బాధ్యత పోషించారు. విరాట్ కోహ్లి (110) పరుగులతో ఆసీస్‌ను బెంబేలెత్తించగా , ఫామ్‌తో తంటాలు పడుతున్న యువరాజ్ ఆఫ్ సెంచరీ చేసి తన సత్తాను నిరూపించుకున్నాడు.యువరాజ్ నిష్ర్కమించిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రైనా స్ట్రోక్ ప్లేతో మరింత రెచ్చిపోయాడు. కోహ్లి-రైనా జంట ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. రైనా కేవలం 47బంతుల్లోనే 71 పరుగులు చేసి జట్టును విజయం ముంగిట నిలిపాడు. దీంతో భారత్ 1-0 ఆధ్యిక్యం సాధించి సిరీస్‌పై కన్నేసింది.ఆసీస్ బౌలర్లలో మెక్‌కే మూడు, హాస్ట్రింగ్స్ రెండు వికెట్లు తీశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...