లోటస్ టెంపుల్‌లో సత్యనారాయణ వ్రతం
వాషింగ్టన్,అక్టోబర్ 28: అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం తలపెట్టిన ‘ అమెరికా వ్రత మహోత్సవ యాత్ర’ వాషింగ్టన్ చేరుకుంది. ఇక్కడి వర్జీనియా ఫెయిర్‌ఫాక్స్‌లో నెలవై వున్నశ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్‌లో కొలువుదీర్చిన మూర్తికి తొలుత సంప్రదాయ పూజాధికాలు నిర్వహించారు. అనంతరం పేర్లు నమోదు చేయించుకున్న తెలుగు వారితో పురోహిత బృందం విడతల వారీగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు. మరోవిడత మేరీలాండ్‌లో వ్రత మహోత్సవ నిర్వహణ వుంటుందన్నారు.
Comments