న్యూజెర్సీలో ‘సత్య’దేవుని వ్రతం




న్యూజెర్సీ,అక్టోబర్ 23: అన్నవరం దేవుడు అమెరికా చేరుకున్నాడు. చెంతకొచ్చిన స్వామి ముంగిట న్యూజెర్సీ తెలుగువారు నోము నోచుకున్నారు. అమెరికాలోని తొమ్మిది నగరాల్లో అన్నవరం దేవస్థానం తలపెట్టిన సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి విడతగా న్యూజెర్సీలో వ్రత నిర్వహణ బృందం శాస్త్రోక్తమైన పూజతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.న్యూజెర్సీ గురువాయురప్ప దేవాలయంలో సత్యనారాయణ స్వామికి ‘స్తపన’, ‘అభిషేకం’ నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొనేందుకు 300 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, రానున్న రెండు రోజుల్లో మరో 150 మంది వరకూ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉన్నదన్నారు.అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవానికి అవసరమైన పూజాద్రవ్యాలు, ఇతర సామాగ్రితో క్షేమంగా చేరుకున్నట్లు ఇద్దరు అధికారులు, ఆరుగురు పురోహితులతో కూడిన కార్యక్రమ నిర్వహణ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారి రామచంద్ర మోహన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు