Friday, October 22, 2010

‘రక్త చరిత్ర’పై టీడీపీ రగడ

హైదరాబాద్,అక్టోబర్ 22:   రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన రక్తచరిత్ర సినిమాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించారనే తరహాలో చూపారంటూ రాష్టవ్య్రాప్తంగా టీడీపీ శ్రేణులు ధర్నాలు, అందోళనలు నిర్వహించాయి. పలుచోట్ల సినిమా హాళ్లపై దాడులకు దిగి సినిమా ఫ్లెక్సీలను, వాల్‌పోస్టర్లను చించివేశారు. వర్మ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్టీఆర్ పాత్రను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామ్‌గోపాల్ వర్మను హెచ్చరించారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాకే చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. కాగా సినిమాలోని సన్నివేశాలు తనను కలచి వేశాయని లక్ష్మీపార్వతి చెప్పారు. దర్శకుడు, నిర్మాత ఎంత బుకాయించినా సహించేది లేదని స్పష్టంచేశారు. చరిత్రను వక్రీకరించేలా సినిమాను నిర్మించారని ఆరోపించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...