Tuesday, October 26, 2010

సాకర్‌ జోస్యం చెప్పిన జర్మనీ ఆక్టోపస్‌ మృతి

article-1289549-0A3283A8000005DC-379_634x392

జర్మనీ,అక్టోబర్ 26 : సాకర్‌ విజేత ఎవరో ముందే జోస్యం చెప్పి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జర్మన్‌ ఆక్టోపస్‌ మృతి చెందింది. ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ పోటీల్లోజర్మనీ ఓడిపోతుందని, ఫైనల్లో స్పెయిన్‌ గెలుస్తుందని చెప్పిన పాల్‌ ఆక్టోపస్‌ జోస్యం నిజమయింది. దీంతో పాల్‌కు కోట్లాడి మంది అభిమానలు తయారయ్యారు. ఇపుడు వారంతా విషాదంలో మునిగిపోయారు. ఒక్క ఫుట్‌బాలే కాదు ఇంకా చాలా ఫలితాలను పాల్‌ ముందే చెప్పేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచేది.పాల్‌ అనే పేరున్న ఈ రెండేళ్ల వయసు గల ఎనిమిదికాళ్ల సముద్రజీవికి అభిమానులతో పాటు శత్రువులూ పెరిగారు. జర్మనీ ఆడే మ్యాచ్‌ల ఫలితాలన్నీ కచ్చితంగా అంచనా వేసి చెప్పిన పాల్‌... ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెలబ్రిటీ అయింది. ఫుట్ ‌బాల్‌ ఫలితాలను పాల్‌ (ఆక్టోపస్‌) ఊహించడం ఇదే మొదటిసారి కాదు. అది పుట్టిన తొలి రోజుల్లోనే యూరో 2008 ఫలితాలపై జోస్యం చెప్పింది. ఆ టోర్నీలో జర్మనీ ఆడిన మ్యాచ్‌ ల్లో 80 శాతం ఫలితాలను సరిగ్గా ఊహించింది. అయితే నాటి ఫైనల్లో స్పెయిన్‌పై జర్మనీ గెలుస్తుందని చెప్పింది. కాకపోతే జర్మనీ ఓడిపోయింది. ఈసారి ప్రపంచకప్‌ ఆరంభం నుంచి జర్మనీ ఆడే అన్ని మ్యాచ్‌ల ఫలితాలను కచ్చితంగా చెప్పింది. ఒక్కటి కూడా తప్పు కాలేదు. సెమీస్‌లో స్పెయిన్‌ చేతిలో జర్మనీ ఓడిపోతుందని చెప్పినా... యూరో ఫైనల్‌లో తప్పు జోస్యం చెప్పిందని, కాబట్టి ఏం కాదని అభిమానులు కొంత ధైర్యం చెప్పుకున్నారు. కానీ పాల్‌ చెప్పినట్లే ఫలితం వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆక్టోపస్‌కు ఎంత క్రేజ్‌ వచ్చిందంటే... మ్యాచ్‌ అయిపోగానే 99 శాతం మంది అభిమానులు దీనినే గుర్తు చేసుకున్నారు. ఇంగ్లండ్‌ లో జన్మించిన ఈ ఆక్టోపస్‌ ప్రస్తుతం జర్మనీలో పెరుగుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...