Tuesday, October 19, 2010

చెచెన్యా పార్లమెంటుపై మిలిటెంట్ల దాడి

మాస్కో,అక్టోబర్ 19: చెచెన్యా పార్లమెంటు పై మంగళవారం నలుగురు మిలిటెంట్లు దాడి చేసి బీభత్సం సృష్టించారు. వారి దాడిలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా, 17 మంది పోలీసులు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఇద్దరు మిలిటెంట్లను కాల్చి చంపాయి. మిగతా ఇద్దరు దుండగులు తమను తాము పేల్చేసుకున్నారు. ఆత్మాహతి జాకెట్లు ధరించిన మిలిటెంట్లు తొలుత తమ వాహనంలో పార్లమెంటులోకి ప్రవేశించారు. అక్కడి పోలీసులపై కాల్పులు జరిపారు. కొంత మంది ఎంపీలను, అధికారులను నిర్బం ధించారు. దీంతో భద్రతా బలగాలు వారిపై దాడికి దిగాయి. ఇరు పక్షాల మధ్య 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. రష్యాలో భాగంగా ఉన్న చెచెన్యా రిపబ్లిక్‌లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో చెచెన్యాలో అధ్యక్షుడి అంగరక్షకులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన దాడిలో 19 మంది మృతిచెందారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...