Friday, October 22, 2010

‘ఫాల్కే’ అందుకున్న మూవీ మొఘల్ డి. రామానాయుడు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: 57వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. సినీ అతిరథులంతా ఒకేచోట దర్శనమిచ్చిన అరుదైన ఘటనకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికైంది. ఈ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రతిభాపాటిల్ పురస్కార గ్రహీతలకు అవార్డులను అందించారు. ప్రతిష్ఠా త్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2009 సంవత్సరానికి ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందుకున్నారు. రామానాయుడు ఆ అవార్డును తీసుకొనేందుకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయన సతీమణి, కుమారులు సురేష్, వెంకటేష్, మనవడు రానా అవార్డు ప్రదానోత్సవాన్ని తిలకించారు. ఇక ఇక జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి పురస్కారాన్ని ‘పా’ చిత్రంలో అభినయానికిగానూ అమితాబ్ బచ్చన్ స్వీకరించారు. అమితాబ్ కు రజత కమలాన్ని, 50 వేల నగదును అందించారు. ఆయన అవార్డు అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు. తెలుగు సినిమా సత్తా చాటిన ‘మగధీర’లో ధీర..ధీర పాటకు న్రు త్యరీతులు సమకూర్చిన డ్యాన్స్ మాస్టర్ శివశంకర్, అదే సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన ఆర్. కమల్ కణ్ణన్ కూడా అవార్డులు అందుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...