సోనియాతో అశోక్ చవాన్ భేటీ: రాజీనామాకు రెడీ
న్యూఢిల్లీ,అక్టోబర్ 30: ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల’ వివాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామాకు సిద్ధపడ్డారు. శనివారం కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా ను కలసిన అశోక్ చవాన్ తన రాజినామా పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆమెకే అప్పగించారు. కాగా,మొత్తం వ్యవహారం పై నివేదిక సమర్పించవలసిందిగా పార్టీ సీనియర్ నాయకులు ప్రణబ్,ఆంటోనిలను సోనియా ఆదేశించినట్టు ఏ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి జనార్ధన పూజారి మీడియాకు తెలిపారు. నివేదిక అందిన తరువాత సోనియా నిర్ణయం తీసుకంటారని ఆయన చెప్పారు. ముంబై వుగ్రవాద దాడుల అనంతరం విలాస్ రావ్ దేశ్ ముఖ్ రాజీనామా చేయడంతో అశోక్ చవాన్ ముఖ్యమంత్రి గా నియమితులైన విషయం తెలిసిందే.
Comments